News November 4, 2025

ఆదిలాబాద్: ఈనెల 6 నుంచి జిన్నింగ్ మిల్లుల మూసివేతపై కలెక్టర్ సమీక్ష

image

రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లులు నవంబర్ 6 నుంచి నిరవధికంగా మూసివేయనున్నట్లు తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగ అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులు, మార్కెటింగ్, వ్యవసాయ, రవాణా, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Similar News

News November 5, 2025

పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు చర్యలు: ఆదిలాబాద్ కలెక్టర్

image

రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, పారదర్శకతకు కట్టుబడి ఉండాలని సూచించారు.

News November 5, 2025

UTNR: కొత్త ఐటీడీఏ పీవో ముందున్న సవాళ్లివే

image

ఉట్నూర్ ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ పీవోగా యువరాజ్ మర్మాట్ నియమితులయ్యారు. పీవీటీజీల అభివృద్ధి, గిరిజన గ్రామాల్లో వైద్యం, మౌలిక వసతుల కల్పన వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో సమస్యల పరిష్కారం, రానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రవేశపెట్టిన మిషన్ లక్ష్యం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 4, 2025

ADB: ‘రేపు పత్తి కొనుగోళ్లు బంద్’

image

ఈనెల 5వ తేదీన గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పత్తి కొనుగోలు నిలిపివేశామని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మంగళవారం తెలియజేశారు. ఈనెల 6 నుంచి కొనుగోలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కోరారు.