News November 4, 2025
ఏటూరునాగారం: అటవీశాఖ సార్లు.. ఇదేం పని..!

ఏటూరునాగారం మండలం కొమురంభీం గుత్తికోయగూడెంలో ఇటీవల అటవీశాఖ అధికారులు ఓ పాఠశాల నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో అటవీశాఖ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. పాఠశాల భవనం స్లాబ్ లెవెల్ వచ్చేవరకు బీట్ పరిధి అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటని ఆరోపిస్తున్నారు. తీరా పైకప్పు వేసే సమయంలో నిర్మాణం ఆపేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ పాఠశాల భవనానికి కలెక్టర్ నిధులు మంజూరు చేశారు.
Similar News
News November 5, 2025
మేడికొండూరు: అదును చూసి.. భారీ చోరీ

మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య దీక్షలో ఉండి ఇంటికి తాళం వేసి బయట ఉండగా, దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. వారు బీరువా పగలగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 5, 2025
ఉట్నూర్: ఈ నెల 11న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపఃల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ 50% మార్కులతో, 26 ఏళ్ల లోపు వయస్సు వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ సర్టిఫికెట్లు, ఆధార్, పాన్ కార్డులతో కళాశాలలో హాజరు కావాలన్నారు. వివరాలకు 9885762227, 9321825562ను సంప్రదించాలాన్నారు
News November 5, 2025
రిహ్యాబిలిటేషన్ సెంటర్‌లో చేరిన స్టార్ క్రికెటర్

T20 WC ఆఫ్రికా క్వాలిఫయర్స్‌కు స్టార్ బ్యాటర్ షాన్ విలియమ్స్ అందుబాటులో ఉండరని జింబాంబ్వే క్రికెట్ ప్రకటించింది. యాంటీ డోపింగ్, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతని సెంట్రల్ కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయట్లేదని తెలిపింది. అతను డ్రగ్ అడిక్షన్‌తో ఇబ్బంది పడుతూ రిహ్యాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లినట్లు ఒప్పుకున్నారని తెలిపింది. విలియమ్స్ అన్ని ఫార్మాట్లలో కలిపి 56 హాఫ్ సెంచరీలు, 14 శతకాలు సహా 8968 రన్స్ చేశారు.


