News November 4, 2025
కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్షా సమావేశం

PDPL జిల్లా వైద్యధికారి డా.వాణిశ్రీ ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై నెలవారీ సమీక్షా సమావేశం జరిగింది. ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి జ్వరగ్రస్తుల రక్త నమూనాలు సేకరించి, మలేరియా, డెంగ్యూ రాపిడ్ టెస్టులు చేయాలని ఆమె సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్‌లు నమూనాలను T హబ్ సెంటర్‌కు పంపించాలని, పరికరాలు సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 5, 2025
శ్రీశైలంలో పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

శ్రీశైలంలో ఇవాళ జరిగే జ్వాలాతోరణం, ఈనెల 14న జరిగే కోటి దీపోత్సవానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా జరిగే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. పుణ్యస్నానాలు ఆచరించే చోట పోలీసుల ఆదేశాలు, సూచనలను భక్తులు తప్పనిసరిగా పాటించాలన్నారు.
News November 5, 2025
గాజువాక: ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు కాజేశారు

గాజువాకలో భార్యాభర్తలిద్దరినీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చట్టివాణిపాలేనికి చెందిన అలేఖ్య నర్సింగ్ చదువుతుండగా.. భర్త వినాయకరావు బీటెక్ చదివాడు. ఇద్దరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మల్కాపురానికి చెందిన మచ్చ సజిని, నారాయణ రూ.91 లక్షలు కొట్టేశారు. వీరికి శ్రీహరిపురానికి చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్య కుమార్, సీరపు రాంప్రసాద్, సీరపు అనిత సహకరించారు.
News November 5, 2025
మేడికొండూరు: అదును చూసి.. భారీ చోరీ

మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య దీక్షలో ఉండి ఇంటికి తాళం వేసి బయట ఉండగా, దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. వారు బీరువా పగలగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


