News November 4, 2025
ASF: ‘పత్తి కొనుగోలులో పరిమితి ఎత్తివేయాలి’

ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా నాయకుడు ప్రణయ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం తేమ, నాణ్యతతో పాటు పరిమితుల పేరుతో కొత్త నిబంధనలు పెట్టి రైతులను సీసీఐ ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు.
Similar News
News November 5, 2025
VKB: బస్సు ప్రమాద బాధిత కుటుంబానికి స్పీకర్ సాయం

చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ధన్నారం తండాకు(శ్రీరాంనగర్ తండా) చెందిన తారాబాయి కుటుంబానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల పరిహారంతో పాటు, తనవంతుగా రూ.1 లక్షను స్పీకర్ అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత అని స్పీకర్ అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
News November 5, 2025
మార్చి 31 నాటికి అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో పీఎం జన్మన్ కింద మార్చి 31వ తేదీ నాటికి లబ్ధిదారుల అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని హౌసింగ్ పీడీని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 556 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, ఇప్పటివరకు 18 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. గ్రౌండింగ్‌లో ఉన్న 281 ఇళ్లు, ఇంకా ప్రారంభించని 257 ఇళ్లను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు.
News November 5, 2025
MDK: ఆందోళనకు గురి చేస్తున్న ఆత్మహత్యలు

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఇటీవల యువకుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 25 ఏళ్ల వయసులోపు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట గ్రామంలో మూడు నెలల వ్యవధిలో ముగ్గురు యువకులు వివిధ కారణాలతో క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారులు స్పందించి యువకులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


