News November 4, 2025

సూర్యాపేట: అంతరాష్ట్ర దొంగ మధు అరెస్ట్

image

నడిగూడెం మండలం వల్లాపురానికి చెందిన అంతరాష్ట్ర దొంగ కిన్నెర మధు(37)ను HYD నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. OCT 30న HYDలో చేసిన ఓ చోరీ కేసులో అతనితోపాటు APకి చెందిన వ్యక్తి (35) నుంచి రూ.30 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, KG వెండి ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. మధు గతంలో 25కుపైగా కేసుల్లో జైలుకెళ్లాడు. 2018లో KDD PS వారు PD చట్టం ప్రయోగించారు. చివరగా 2024లో చర్లపల్లి జైలుకు వెళ్లాడు.

Similar News

News November 5, 2025

పాలమూరు వర్సిటీకి మరో గౌరవం

image

పాలమూరు వర్సిటీ విద్యా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.శ్రీనివాస్ “వాలీబాల్ ప్లేయర్స్‌పై డాటా డ్రీవన్ మానిటరింగ్ సిస్టం” అనే అంశంపై యూటిలిటీ పేటెంట్ పొందారు. ఈ మేరకు ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు ఆయనను అభినందించారు. నూతన ఆవిష్కరణల్లో మరింత చురుకుగా పాల్గొనాలని వీసీ కోరారు.

News November 5, 2025

నేడు తులసి పూజ ఎందుకు చేయాలి?

image

కార్తీక పౌర్ణమి రోజునే తులసీ మాత భూమిపైకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు తప్పకుండా తులసికి గంగాజలంతో పూజ చేయాలంటారు పండితులు. ఫలితంగా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. తులసి కోట వద్ద దీపారాధన చేసి, దీపదానం చేస్తే.. లక్ష్మీ దేవి సంతోషించి, కటాక్షాన్ని ప్రసాదిస్తుందట. అంతేకాక, పసుపు పూసిన నాణాన్ని ఎరుపు వస్త్రంలో ఉంచడం వలన కుటుంబంలో సంపదలు పెరిగి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.

News November 5, 2025

అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

image

అనూరాధ కార్తె(నవంబర్) సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ కాలంలోని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వర్షాలు, వ్యవసాయానికి ఎంతగానో తోడ్పడతాయి. సాధారణంగా ఫలవంతం కాని లేదా పనికిరాని మొక్క (కర్ర) కూడా ఈ కార్తెలో విపరీతమైన దిగుబడిని ఇస్తుందని.. ఈ సమయంలో రైతులు మంచి పంట దిగుబడిని ఆశించవచ్చనే విషయాన్ని ఈ సామెత నొక్కి చెబుతుంది.