News November 4, 2025

HYD: ఓయూపై సీఎం ఫోకస్.. ప్రణాళిక రూపకల్పన

image

సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం అధ్యక్షతన అధికార యంత్రాగం విస్తృత సమావేశాలు నిర్వహిస్తోంది. రూ. వెయ్యి కోట్ల నిధులతో ఓయూను ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ మేరకు భాగస్వామ్య పక్షాలతో ఓయూ పాలకవర్గం సమావేశమైంది. పలు విషయాలపై చర్చించారు.

Similar News

News November 5, 2025

పాలమూరు వర్సిటీకి మరో గౌరవం

image

పాలమూరు వర్సిటీ విద్యా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.శ్రీనివాస్ “వాలీబాల్ ప్లేయర్స్‌పై డాటా డ్రీవన్ మానిటరింగ్ సిస్టం” అనే అంశంపై యూటిలిటీ పేటెంట్ పొందారు. ఈ మేరకు ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు ఆయనను అభినందించారు. నూతన ఆవిష్కరణల్లో మరింత చురుకుగా పాల్గొనాలని వీసీ కోరారు.

News November 5, 2025

నేడు తులసి పూజ ఎందుకు చేయాలి?

image

కార్తీక పౌర్ణమి రోజునే తులసీ మాత భూమిపైకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు తప్పకుండా తులసికి గంగాజలంతో పూజ చేయాలంటారు పండితులు. ఫలితంగా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. తులసి కోట వద్ద దీపారాధన చేసి, దీపదానం చేస్తే.. లక్ష్మీ దేవి సంతోషించి, కటాక్షాన్ని ప్రసాదిస్తుందట. అంతేకాక, పసుపు పూసిన నాణాన్ని ఎరుపు వస్త్రంలో ఉంచడం వలన కుటుంబంలో సంపదలు పెరిగి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.

News November 5, 2025

అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

image

అనూరాధ కార్తె(నవంబర్) సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ కాలంలోని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వర్షాలు, వ్యవసాయానికి ఎంతగానో తోడ్పడతాయి. సాధారణంగా ఫలవంతం కాని లేదా పనికిరాని మొక్క (కర్ర) కూడా ఈ కార్తెలో విపరీతమైన దిగుబడిని ఇస్తుందని.. ఈ సమయంలో రైతులు మంచి పంట దిగుబడిని ఆశించవచ్చనే విషయాన్ని ఈ సామెత నొక్కి చెబుతుంది.