News November 5, 2025
నిజామాబాద్: ఇద్దరికి జైలు శిక్ష

నవీపేట్ మండలం లింగాపూర్ గ్రామంలో 2020 సంవత్సరంలో పొలం వివాదంలో గొడవ కారణంగా కేశపురం మహేశ్ పై గడ్డపారతో దాడి చేయగా గగ్గోని నవీన్, గగ్గోని హనుమాన్లుపై కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా ఈరోజు నిజామాబాద్ స్టేషన్ కోడ్ జడ్జి సాయిసుధా ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి గగ్గోని నవీన్‌కు ఐదేళ్లు, హనుమాన్లుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారని నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు.
Similar News
News November 5, 2025
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 పోస్టులు

<
News November 5, 2025
కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 5, 2025
ఉసిరి దీపాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం.


