News November 5, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 43 మందికి శిక్షలు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి 43 మందికి కోర్టు శిక్షలు విధించింది. మద్యం తాగి వాహనం నడిపిన ఆరుగురు వ్యక్తులకు న్యాయస్థానం 1 రోజు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. వీరిలో కామారెడ్డిలో ఇద్దరు, మాచారెడ్డి, దోమకొండ, తాడ్వాయి ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మిగిలిన 37 మంది వాహనదారులకు రూ.37 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
Similar News
News November 5, 2025
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 పోస్టులు

<
News November 5, 2025
కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 5, 2025
ఉసిరి దీపాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం.


