News April 11, 2024
షర్మిలతో ఆమంచి భేటీ

పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బెంగళూరులో కలిశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు తొలిసారిగా చీరాల అసెంబ్లీ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన షర్మిలకు గుర్తు చేశారు. తన చేరికకు వీలుగా చీరాల రావలసిందిగా ఆమంచి ఆహ్వానించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.
Similar News
News March 15, 2026
పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూచనలు

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఓఎంఆర్ షీట్‌లోని సబ్జెక్టు కోడ్, రూమ్ నెంబర్ వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
News March 15, 2026
పర్చూరు: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన కారు.. 42 గొర్రెలు మృతి

పర్చూరు దేవరపల్లి వద్ద అతివేగంగా వచ్చిన కారు దూసుకెళ్లి 42 గొర్రెలు మృతి చెందగా, 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. తాళ్లూరు, ముండ్లమూరు మండలాల నుంచి వలస వచ్చిన కాపరులకు సుమారు లక్షల్లో నష్టం వాటిల్లింది. రాష్ట్ర సహాయక కార్యదర్శి తిరుపతిరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుపేద కాపరులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
News March 15, 2026
ప్రకాశం: పాలేరు వాగులో మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం

జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలోని పాలేరు వాగులో దొరికిన <<19383562>>మృతదేహంపై <<>>పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుడి ఆనవాళ్ల కోసం సోషల్ మీడియాలో ఫొటోలు ఉంచడంతో పాటు పక్క జిల్లాల పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపినట్లు ఎస్ఐ మహేంద్ర తెలిపారు. ఎవరైనా అదృశ్యమైన వ్యక్తుల వివరాలు ఉంటే తక్షణమే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.


