News November 5, 2025

నారాయణపురం: కోతుల దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు

image

కోతుల దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన సంస్థాన్ నారాయణపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తన ఇంటి ఆవరణలో పనిచేస్తున్న శివ స్వామిపై కోతుల గుంపు ఒకసారిగా దాడి చేసింది. కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శివ స్వామి కిందపడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదుకు తరలించారు.

Similar News

News November 5, 2025

విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే గుర్తింపు రద్దు

image

AP: కోర్సులు పూర్తైనా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఆ కాలేజ్, ప్రైవేటు వర్సిటీ గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తామని ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.15 లక్షలు జరిమానా విధిస్తామంది. ప్రైవేటు కాలేజీలపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. అదనంగా వసూలు చేసిన ఫీజులను కూడా తిరిగి ఇచ్చేయాలని పేర్కొంది. ఫ్యాకల్టీ సర్టిఫికెట్లు ఇచ్చేయాలని తెలిపింది.

News November 5, 2025

నేడు ఐనవోలు దేవుడి గుట్టపై అపూర్వ ఘట్టం..!

image

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి కొలువై ఉన్న హనుమకొండ జిల్లా ఐనవోలులో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నేడు అపూర్వ ఘట్టం ఆవిష్కరణ కానుంది. ఏటా గ్రామంలోని చెరువు సమీపంలో ఉండే దేవుడి గుట్టపై అఖండ జ్యోతిని వెలిగించనున్నారు. 50 కేజీల కర్పూరం, 60 కేజీల వత్తులు, 50 కేజీల నూనెను దీనికి వాడనున్నారు. సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఈ ఘట్టాన్ని ఊరంతా తిలకించనుంది.

News November 5, 2025

పంచగ్రామాల సమస్యకు పరిష్కారం ఎప్పుడు?

image

సింహాచలం పరిధిలోని అడవివరం, వెంకటాపురం, వేపగుంట, పురుషోత్తపురం&చీమలాపల్లి పరిధిలో సుమారు 12 వేల వరకు ఇళ్లు ఉన్నాయి. సింహాచలం దేవస్థానం, ఆయా గ్రామాలకు యాజమాన్య హక్కులు ఉన్నా క్రమబద్ధీకరణ అవ్వలేదు. దీంతో నివాసితులు తమ ఇళ్లను అమ్మడం, కొత్త‌వారు కొన‌డం లేదా మరమ్మతు చేయడం కష్టతరంగా మారింది. దేవ‌స్థానానికి ఇచ్చిన రైత్వారీ ప‌ట్టాల‌ను ర‌ద్దు చేసి త‌మ‌కు <<18202286>>న్యాయం చేయాల‌ని<<>> ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.