News November 5, 2025
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈఓ

వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పదో తరగతి స్పెషల్ క్లాసులను ఆమె తనిఖీ చేశారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఫలితాలు మరింత మెరుగుపడాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి గోపాల్ పాల్గొన్నారు.
Similar News
News November 5, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: ఓటేసిన 97 మంది

జూబ్లీహిల్స్‌లో మంగళవారం హోం ఓటింగ్‌కు మంచి స్పందన వచ్చింది. 97 మంది వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోం ఓటింగ్ కోసం మొత్తం 103 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 95 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం విశేషం. పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఈ స్ఫూర్తితోనే నవంబర్ 11న కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆశిద్దాం.
News November 5, 2025
జనగామ: సీసీఐ కొర్రీలు.. దళారుల దండు!

జిల్లాలో క్వింటాకు ₹8,100 మద్దతు ధరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించినా, రైతులకు కొర్రీలు ఎదురవుతున్నాయి. స్లాట్ బుక్ చేసుకుని పత్తి తెస్తే.. కాయలు, తేమ ఎక్కువ ఉన్నాయని తిరస్కరిస్తున్నారు. దీంతో చేసేది లేక పురుగులు, వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతులు, దళారుల పాలు అవుతున్నారు. వారు ₹5,000కే ప్రైవేటుగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంక్షలు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
News November 5, 2025
నష్టం వివరాలను త్వరగా పంపించండి: కలెక్టర్

తుఫాన్ నేపథ్యంలో జరిగిన నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి వెంటనే నివేదికలు పంపించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఈ మేరకు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన ఈ పంట ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే దెబ్బతిన్న రహదారుల వివరాలను సైతం పంపాలన్నారు.


