News November 5, 2025
కరీంనగర్: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

KNR జిల్లా తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీలో పురుషుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాలున్న పురుషులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు Nov9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు తమను సంప్రదించవచ్చన్నారు. SHARE IT.
Similar News
News November 5, 2025
బాపట్ల: మద్యం తాగి బస్సు నడుపిన డ్రైవర్

బాపట్ల జిల్లా SP ఆదేశాల మేరకు మార్టూరు సీఐ శేషగిరిరావు, రవాణాశాఖ అధికారులు NH–16పై మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అతివేగంగా వస్తున్న ఇంటర్ సిటీ స్మార్ట్ బస్‌ను తనిఖీ చేయగా.. డ్రైవర్ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బస్ డ్రైవర్‌ను తనిఖీ చేయకుండా పంపిన మేనేజర్, కెప్టెన్‌లపై కూడా చర్యలు చేపట్టారు.
News November 5, 2025
న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ

అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ (34) ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో న్యూయార్క్ మేయర్ అయిన ఘనత కూడా ఈయనదే. డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన జోహ్రాన్ స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూపై గెలిచారు. మమ్‌దానీ తల్లిదండ్రులు ఇండియాలో జన్మించారు.
News November 5, 2025
ఆలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు: వరంగల్ సీపీ

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాల వద్ద పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకుని తోపులాటలు లేకుండా భక్తులు క్యూలైన్లలో కొనసాగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది సాయం తీసుకోవాలని సీపీ పేర్కొన్నారు.


