News April 11, 2024

ఏప్రిల్ 11: చరిత్రలో ఈరోజు

image

1827: సంఘ సంస్కర్త జ్యోతీరావు పూలే జననం
1869: కస్తూరిబాయి గాంధీ జననం
1904: నటుడు, గాయకుడు కుందన్ లాల్ జననం
1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది
2010: నక్సలైట్ ఉద్యమకారుడు పైల వాసుదేవరావు మరణం
* ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం
* జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం

Similar News

News March 15, 2026

మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు: వైసీపీ

image

AP: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన <<19386182>>డ్రగ్స్ పార్టీలో<<>> టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారని వైసీపీ ట్వీట్ చేసింది. టీడీపీ డ్రగ్స్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో యువత భవిష్యత్‌ను నాశనం చేస్తోందని మండిపడింది. ‘మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు హోంమంత్రి’ అంటూ అనిత, చంద్రబాబు, పవన్, లోకేశ్‌ను ట్యాగ్ చేసింది.

News March 15, 2026

నెతన్యాహును వేటాడి మరీ చంపేస్తాం: IRGC

image

నెతన్యాహు మరణించలేదంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ఒకవేళ ఆయన బతికే ఉంటే వేటాడి మరీ చంపేస్తామని IRGC హెచ్చరించింది. మరోవైపు నెతన్యాహు చేతికి ఆరువేళ్లు ఉన్నాయని.. అది <<19382555>>AI వీడియో<<>> అని ఇరాన్ వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది AI వీడియో కాదని, లైటింగ్ వల్ల ఆప్టికల్ ఇల్యూజన్ ఏర్పడి అలా ఒక వేలు ఎక్స్‌ట్రా ఉన్నట్లు కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.

News March 15, 2026

బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

image

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్‌ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్‌ (లేదా) 2mlహెక్సాకొనజోల్‌ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్‌ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్‌ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్‌ కలిపి పిచికారీ చేయాలి.