News November 5, 2025
హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

TG: ఈ నెల 10 నుంచి 22 వరకు హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఇందులో ఎన్‌రోల్ చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మన్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 12న అడ్మిట్ కార్డులు పొందిన వారికే ఈ అవకాశం అని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు 040-27740059కు కాల్ చేయాలని సూచించారు.
Similar News
News March 18, 2026
ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వకండి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వకుండా చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి డీపీవో భాస్కర్‌ను టెలి కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. బుధవారం ఓటర్ల మ్యాపింగ్, తాగునీటి సమస్య, శానిటేషన్ అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. 484 గ్రామ పంచాయతీలలో ఓటర్లను మ్యాప్ చేసేటప్పుడు కరెక్ట్‌గా చేశారా, లేదా అనేది చూసుకోవాలని పేర్కొన్నారు.
News March 18, 2026
భారత్‌లో తెలంగాణ అంతర్భాగం కాదా: మంత్రి పొన్నం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ఫైరయ్యారు. ‘BJP నుంచి 8 మంది MPలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. రాష్ట్రానికి ఏం తెచ్చారు? రావాల్సిన నిధులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. భారత్‌లో TG అంతర్భాగం కాదా? నిధులు ఎందుకు కేటాయించరు? రాష్ట్ర ఏర్పాటు విషయంలో తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని BJP కేంద్ర నేతలు అంటే రాష్ట్ర నేతలు ఎందుకు మాట్లాడలేదు’ అని ప్రశ్నించారు.
News March 18, 2026
ఇంటికే గ్యాస్.. ఏజెన్సీల వద్ద వేచి ఉండొద్దు: కేంద్రం

గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఏజెన్సీల వద్దకు వెళ్లొద్దని, సిలిండర్లను నేరుగా ఇంటికే పంపిణీ చేస్తామని వెల్లడించింది. IVRS, వాట్సాప్, మొబైల్ యాప్, <<19379922>>మిస్డ్‌కాల్<<>>, UPI యాప్స్‌ల ద్వారా బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందకుండా ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది.


