News November 5, 2025

250 కేజీల బియ్యంతో అన్నాభిషేకం

image

కపిలతీర్థంలో జరిగే అన్నాభిషేకానికి 250 కిలోల బియ్యాన్ని వండుతారు. భూమితలం నుంచి పానవట్టం వరకు లింగాన్ని అన్నంతో కప్పుతారు. ఆ తరువాత ఒక చిన్న శివలింగాన్ని, నందిని తీర్చిదిద్దుతారు. లింగంపై వివిధ రకాల కూరగాయలను ఉప్పు లేకుండా ఉడికించి సర్పాభరణాలుగా, చంద్రవంకగా, డమరుకంగా, త్రిశూలంగా అలంకరిస్తారు. అంతేకాకుండా పోలీసులు, సుఖియలు, మురుకులు, ఫేణీలు, వడలతో అలంకరిస్తారు.

Similar News

News March 31, 2026

కుళ్లిన కూరగాయలు.. భద్రాద్రి కలెక్టర్ ఆగ్రహం

image

పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్‌ను పరిశీలించగా, అక్కడ కుళ్లిన కూరగాయలు కనిపించడంతో కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 31, 2026

KNR: హత్య కేసులో సంచలన తీర్పు

image

చెరువులో చేపలు పట్టుకునే వివాదంలో వ్యక్తిని హత్య చేసిన కేసులో 15 మందికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. 2019 ఏప్రిల్ 19న కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో జరిగిన ఘర్షణలో తిరుపతి అనే వ్యక్తి మృతి చెందారు. దీనిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేయగా, విచారణ అనంతరం జిల్లా జడ్జి శివకుమార్‌ నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ సంచలన తీర్పు వెలువరించారు.

News March 31, 2026

విజయవాడలో రేపే జాబ్ మేళా

image

కొత్తపేట KBN కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా ద్వారా రూ.12 వేల నుంచి రూ.50 వేల వేతనంతో పలు కంపెనీలలో ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు జిల్లా స్కిల్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, బీటెక్ పూర్తి చేసి, 18-35 సం.లలోపు వయస్సున్న అభ్యర్థులు హాజరు కావొచ్చన్నారు. https://naipunyam.ap.gov.in/user-registrationలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.