News November 5, 2025
ఖమ్మం: నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోండి

ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వం వారి DEET APPను ఫోన్లో డౌన్ లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. రిఫరల్ కోడ్:JSBCM అని టైప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ APPలో దాదాపు 900 కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించడానికి రిజిస్టర్ చేసుకున్నాయని అన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 5, 2025
నవంబర్ 10-19 వరకు సమ్మేటివ్ పరీక్షలు

AP: రాష్ట్రంలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో నిర్వహించే సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నవంబర్ 10 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 5వ తరగతులకు ఉ.9.30 నుంచి మ.12.30 వరకు, 6, 7 క్లాసులకు మ.1.15 నుంచి సా.4.15 వరకు జరుగుతాయి. 8-10 తరగతులకు ఉ.9.15 నుంచి 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా తరగతుల పరీక్ష పేపర్ల నమూనా వివరాలను షెడ్యూల్‌లో పొందుపరిచింది.
News November 5, 2025
కేసీఆర్‌ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు: కిషన్ రెడ్డి

TG: కాళేశ్వరంలో అవినీతికి కేసీఆర్‌ను PM మోదీ ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలంటూ సీఎం రేవంత్ చేసిన <<18200152>>వ్యాఖ్యలకు<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. తాము ఎవరినీ జైలులో వేయమని, కోర్టులు వేస్తాయని తెలిపారు. KCRను జైలులో వేస్తామని తాము చెప్పలేదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం NDSA నివేదికపై మాత్రమే సీబీఐ విచారణ కోరింది. గవర్నర్ తన అధికారాలను స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు.
News November 5, 2025
HYD: 19 మంది చనిపోయినా గుంత పూడ్చలే?

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన గుంతను పూడ్చే విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. యాక్సిడెంట్ నేపథ్యంలో ఈ గుంతను మంగళవారం ఉదయం డస్ట్‌తో పూడ్చారు. సాయంత్రం డస్ట్ అంతా కొట్టుకుపోయి మళ్లీ గుంత యథాస్థితికి వచ్చింది. రాత్రి సమయంలో ఈ గుంత ప్రమాదకరంగా కనిపించింది. ఇంత ఘోరం జరిగినా అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడం గమనార్హం.


