News November 5, 2025
నేడు ఐనవోలు దేవుడి గుట్టపై అపూర్వ ఘట్టం..!

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి కొలువై ఉన్న హనుమకొండ జిల్లా ఐనవోలులో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నేడు అపూర్వ ఘట్టం ఆవిష్కరణ కానుంది. ఏటా గ్రామంలోని చెరువు సమీపంలో ఉండే దేవుడి గుట్టపై అఖండ జ్యోతిని వెలిగించనున్నారు. 50 కేజీల కర్పూరం, 60 కేజీల వత్తులు, 50 కేజీల నూనెను దీనికి వాడనున్నారు. సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఈ ఘట్టాన్ని ఊరంతా తిలకించనుంది.
Similar News
News November 5, 2025
జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

JGTL(D)లో చలి తీవ్రత కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల్లో మన్నెగూడెంలో 20℃, గోవిందారం 20.2, పూడూర్, గొల్లపల్లి 20.3, కథలాపూర్ 20.5, తిరమలాపూర్, పెగడపల్లె 20.6, నేరెళ్ల, మడ్డుట్ల, మల్యాల 20.7, మల్లాపూర్, రాఘవపేట 20.8, జగ్గసాగర్ 21.1, పొలాస, సారంగాపూర్, ఐలాపూర్ 21.2, జగిత్యాల, రాయికల్ 21.4, కోరుట్ల, గోదూరు, బుద్దేశ్‌పల్లి, కొల్వాయి 21.5, మేడిపల్లి 21.6, అల్లీపూర్లో 21.9℃ల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News November 5, 2025
SRSPకి తగ్గిన ఇన్‌ఫ్లో

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గింది. ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి 28,204 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నీటినిల్వ 80.5 టీఎంసీలు, నీటిమట్టం 332.54 మీటర్లుగా ఉందని పేర్కొన్నారు.
News November 5, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: BJP కోసం పవన్?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గరపడింది. ప్రచారానికి కేవలం 4 రోజులు సమయం ఉంది. చివరి ప్రసంగాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. అందుకే అభ్యర్థులు, పార్టీల అగ్ర నాయకులు ప్రచారం జోరుగా చేస్తున్నారు. BJP తరఫున ప్రచారం చేయనున్నారని జనసేన తెలంగాణ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ తెలిపారు. TBJP నేతలతో సమావేశమైన ఆయన ఈ విషయం తెలిపారు. APలో BJP, జనసేన, TDP కూటమిగా ప్రభుత్వం నడుపుతున్న నేపథ్యంలో పవన్ ప్రచారం చేయనున్నారు.


