News November 5, 2025

NGKL: ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే కట్టెల పొయ్యిలకు కాలం చెల్లింది. కట్టెల పొయ్యి ద్వారా వెలువడే పొగ వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వంట కార్మికులు అవస్థలు పడేవారు. ఈ సమస్యలు పరిష్కారం కోసం పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. పాఠశాలల హెడ్మాస్టర్లు గ్యాస్ కనెక్షన్ కోసం కలెక్టర్కు ప్రణాళికలు సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.

Similar News

News March 21, 2026

వెంకట్రావుపేటలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటలో శనివారం ఉరివేసుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం వెంకట్రావుపేటలోని పెద్దమ్మ తండాకి చెందిన జరుఫుల రమేశ్ అనే వ్యక్తి గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరివేసుకొని మృతి చెందాడు. కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలే ఆయన మృతికి కారణమని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 21, 2026

NGKL: ప్రపంచ రికార్డు దిశగా SLBC సొరంగం

image

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టులో భాగంగా ఇన్‌లెట్ నిర్మాణ పనులను అధికారులు మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే దేవరకొండ వైపు అవుట్‌లెట్ పనులు సాగుతుండగా, రెండు వైపులా పనులను వేగవంతం చేశారు. 43.93 కి.మీ. పొడవైన ఈ సొరంగం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా రికార్డు సృష్టించనుంది. భద్రతా ప్రమాణాలతో పనులు ఆటంకం లేకుండా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

News March 21, 2026

మహిళల టీ20ల్లో సంచలనం.. అతిచిన్న వయసులో సెంచరీ

image

అంతర్జాతీయ మహిళల T20ల్లో రువాండా దేశానికి చెందిన ఫాన్నీ ఉటగుషిమనిండే చరిత్ర సృష్టించారు. అతిచిన్న వయసులో(15 ఏళ్ల 223 రోజులు) సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పారు. అంతేకాకుండా డెబ్యూ మ్యాచులోనే సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఘనాతో జరిగిన మ్యాచులో 65 బంతుల్లో 111 రన్స్ చేసి ఆమె ఈ ఘనత సాధించారు. ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండా ప్లేయర్ ప్రొస్కోవియా అలకో (16yrs 233days) పేరిట ఉండేది.