News November 5, 2025

పర్వతగిరి: ఒక్క పాఠశాల.. ఎన్నో ఫిర్యాదులు..!

image

వరంగల్ జిల్లా పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రిన్సిపల్ అపర్ణ జిల్లా సమన్వయ అధికారి కూడా కావడంతో పాఠశాలలో వైస్ ప్రిన్సిపాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థినులు ఉండటంతో వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు చులకనగా చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పాఠశాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది.

Similar News

News March 20, 2026

TODAY HEADLINES

image

☛ ఏపీలో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల
☛ ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు: CM CBN
☛ రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్
☛ తెలంగాణలో ఘనంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరైన సీఎం రేవంత్, చిరంజీవి, కమల్ తదితరులు
☛ కవిత రాజకీయ పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’
☛ కొత్త శక్తికి, ఆరంభానికి ప్రతీక ఉగాది: మోదీ
☛ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

News March 20, 2026

కేరళంపై కమలం గురి – 1/2

image

కేరళంలో పాగా వేయాలని ఈసారి ప్రధాన కూటములు LDF, UDFతో పాటు BJP కూడా శ్రమిస్తోంది. పెరుగుతున్న ఓట్ షేర్‌ను సీట్లుగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10.57%గా ఉన్న BJP షేర్ 2021లో 11.30%కు పెరిగింది. అప్పుడు NDAకి 2.55% తగ్గి 12.41% వచ్చినా వ్యక్తిగతంగా BJPకి ప్లసే అయింది. 2024 LS పోల్స్‌లో NDAకి 19.24% వచ్చింది. ఇందులో ఒక్క బీజేపీకే 16.68% (3.68%+) వచ్చింది. <<-se>>#Elections2026<<>>

News March 20, 2026

కేరళంపై కమలం గురి – 2/2

image

ఇక తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విక్టరీతో బీజేపీకి బూస్ట్ దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాసర్‌గోడ్, పాలక్కడ్, నెమోమ్ సహా 9 స్థానాల్లో BJP రన్నరప్‌గా నిలిచింది. ఈసారి పార్టీ వీటిపై దృష్టి పెడితే కేరళంలో పాగా ఈజీ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్‌ను తిప్పుకోవాలన్న ప్రయత్నాలు సక్సస్ అయితే కేరళంలో ఈసారి బీజేపీ ఇంపాక్ట్ కనిపిస్తుందని అంటున్నారు. <<-se>>#Elections2026<<>>