News November 5, 2025

ఖమ్మంలోని గవర్నమెంట్ బ్యాంక్‌లో JOBS

image

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు రేపటితో ముగుస్తుంది. ఖమ్మంలో 99 స్టాఫ్ అసిస్టెంట్‌‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి. SHARE IT

Similar News

News March 16, 2026

టెన్త్ పరీక్షలు.. తిరుపతి జిల్లాలో 552 మంది గైర్హాజరు

image

సోమవారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2026 ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 27,243 మంది విద్యార్థులకు గాను 26,691 మంది. హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 885 మందికి గాను 785 హాజరు అయినట్లు DEO KVN కుమార్ పేర్కొన్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.

News March 16, 2026

నంద్యాల: పెండింగ్‌లో 2, 797 దరఖాస్తులు

image

నంద్యాల జిల్లాలో 2797 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, రీ ఓపెన్ అయిన 293 దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS ద్వారా 240, రెవిన్యూ క్లినిక్స్ ద్వారా 138 దరఖాస్తులను ప్రజలు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చే వినతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ముందుగానే పరిష్కరించేలా చూడాలన్నారు.

News March 16, 2026

జగిత్యాల: కాంగ్రెస్‌ను వీడనున్న జీవన్ రెడ్డి?

image

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడనున్నట్లు ఆయన సమీప వర్గాలు చెబుతున్నాయి. జగిత్యాలలో ఈనెల 25న తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన BRSలో చేరే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే దీనిపై జీవన్ రెడ్డి అధికారిక ప్రకటన చేయలేదు.