News November 5, 2025

NLG: 4400 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

image

నల్గొండ జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల పరిధిలో L-1 కింద ఉన్న 9 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి తెలిపారు. ఇప్పటివరకు 4400 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% తేమ ఉండడంతో పాటు కపాస్ కిసాన్ అనే యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు మాత్రమే స్లాట్ ఆధారంగా పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకురావాలని సూచించారు.

Similar News

News March 10, 2026

నల్గొండ: నెల రోజుల పాటు పదో తరగతి పరీక్షలు

image

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నెల రోజుల పాటు సాగనున్నాయి. మొత్తం 6 పరీక్షలే ఉన్నప్పటికీ, ప్రతి పేపర్‌కు మధ్య 4 నుంచి 6 రోజుల విరామం ఉండటంతో ఏప్రిల్ మధ్య వరకు షెడ్యూల్ ఖరారైంది. విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యేందుకు SSC బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పరీక్షలు త్వరగా ముగిసేవి, కానీ ఈసారి ప్రతి సబ్జెక్టుకు తగినంత సమయం లభించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 10, 2026

నల్గొండ: బర్డ్ ఫ్లూ భయం.. అధికారి క్లారిటీ

image

నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఆనవాళ్లు లేవని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు. జిల్లాలో కోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని, ఎక్కడా చనిపోయినట్లు ఫిర్యాదులు అందలేదని ఆయన తెలిపారు. ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.

News March 10, 2026

నేటి నుంచి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

image

పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా పశువైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,25,869 తెల్లజాతి, 3,17,279 నల్లజాతి పశువులకు టీకాలను వేయనున్నారు. 3 నెలల వయస్సు వయస్సు నిండిన వాటికి టీకాలు వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ తెలిపారు.