News November 5, 2025

గిరిజనుల సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

కోట, వాకాడు, చిల్లకూరు, గూడూరు, డి.వి.సత్రం మండల్లోని గిరిజనుల సమస్యలపై కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. చైల్డ్ లేబర్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు బషీర్, పలువురు MROలు, MPDOలు, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు. గిరిజనులకు తాగునీరు, గృహాలు, భూమి, అటవీ హక్కుల పట్టాలు, పాఠశాలలు, రహదారులు, అంగన్వాడీలు, గ్రంథాలయాల వంటి అంశాలపై కలెక్టర్ వారితో చర్చించారు.

Similar News

News March 21, 2026

HYDలో భారీగా పెరిగిన ధరలు

image

నగరంలో చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడం, రంజాన్ నేపథ్యంలో మార్కెట్‌లో కిలో చికెన్ ధర ఏకంగా రూ.340- రూ.350కి చేరింది. గతవారం రూ.320- రూ.339 ఉన్న ధర పెళ్లిళ్ల సీజన్, దాణా ఖర్చులు భారం కావడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. మీ ఏరియాలోనూ ధరలు పెరిగాయా?

News March 21, 2026

వికారాబాద్‌లో భారీగా పెరిగిన ధరలు

image

వికారాబాద్ జిల్లాలో చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడంతో వికారాబాద్ మార్కెట్‌లో కిలో చికెన్ ధర ఏకంగా రూ.350కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం, దాణా ఖర్చులు భారం కావడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మాంసాహార ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.

News March 21, 2026

రాజమండ్రి కల్తీ పాల ఘటనలో కోలుకుంటున్న బాధితులు: DMHO

image

రాజమండ్రి కల్తీ పాల ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న నలుగురు బాధితులు కోలుకుంటున్నట్లు DMHO డా. కె.వెంకటేశ్వరరావు ప్రకటించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ ఘటనలో మొత్తం 20 మంది అస్వస్థతకు గురవ్వగా 15 మంది మృతి చెందారు. ఎన్.కొండబాబు(64) పూర్తి ఆరోగ్యంతో సోమవారం డిశ్ఛార్జ్ కాగా, నలుగురు పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.