News November 5, 2025

NTR: రాజా వారి పాట చాలా కాస్ట్ లీ గురూ..!

image

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 8న జరగనున్న ఇళయరాజా కచేరీకి టికెట్ల ధరలు భారీగా ఉండటం విమర్శలకు దారి తీసింది. మీట్ & గ్రీట్ కోసం రూ. 79 వేలు, ముందు వరుసలకు రూ. 59 వేల నుంచి విక్రయిస్తున్నారు. ప్రైవేట్ కార్యక్రమాల కోసం కంకర పోయడంతో గ్రౌండ్ దెబ్బతిని, క్రీడాకారులు గాయపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి.

Similar News

News November 5, 2025

ఏలూరు కలెక్టర్‌తో బేటి అయిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

image

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తూ కలెక్టర్ ప్రజలకు మంచి సేవలను అందించారని కొనియాడారు. ఈ సందర్భంగానే కలెక్టర్‌ను సత్కరించి సంస్థ తరఫున జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యూనియన్ అధ్యక్షుడు జబీర్ తో హరీష్, మిల్టన్, దరిశి నారాయణ, తదితరులు ఉన్నారు.

News November 5, 2025

SRPT: కారు బోల్తా.. మహిళ మృతి, ఇద్దరికి గాయాలు

image

కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన మోతె మండలం మామిళ్లగూడెం దగ్గర జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు పల్టీ కొట్టి పక్కకు పడిపోయింది. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 5, 2025

ప్రగతినగర్: చెరువా.. కాలుష్య కర్మాగారమా?

image

స్థానిక అంబిర్ చెరువు కాలుష్య కర్మాగారంగా దర్శనమిస్తోంది. ఎంతో పురాతనమైన ఈ చెరువు కబ్జాలకు అడ్డాగా మారింది. చెరువు చుట్టూ చెత్తాచెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెరువులోని నీరు కూడా అంతే. ఒక వైపు ఉన్న మాంసం అంగళ్ల నిర్వాహకులు వ్యర్థ పదార్థాలను చెరువులో పడేస్తున్నారు. చెరువు పక్కగుండా వెళ్లాలంటే ముక్కలు మూసుకోవాల్సిందే. అధికారులు స్పందించి చెరువును రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.