News November 5, 2025
బాపట్ల: మద్యం తాగి బస్సు నడుపిన డ్రైవర్

బాపట్ల జిల్లా SP ఆదేశాల మేరకు మార్టూరు సీఐ శేషగిరిరావు, రవాణాశాఖ అధికారులు NH–16పై మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అతివేగంగా వస్తున్న ఇంటర్ సిటీ స్మార్ట్ బస్‌ను తనిఖీ చేయగా.. డ్రైవర్ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బస్ డ్రైవర్‌ను తనిఖీ చేయకుండా పంపిన మేనేజర్, కెప్టెన్‌లపై కూడా చర్యలు చేపట్టారు.
Similar News
News November 5, 2025
Whatsappలో అదిరిపోయే ఫీచర్

వాట్సాప్‌లో త్వరలో ‘యూజర్‌నేమ్ ఆధారిత కాలింగ్’ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో యూజర్లు తమ ఫోన్ నంబర్ ఇవ్వకుండా యూజర్‌నేమ్ ద్వారా ఇతరులకు వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయొచ్చు. యూజర్లు ప్రైవసీ కోసం ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. కొత్త వ్యక్తులతో మాట్లాడేందుకు ఇక వ్యక్తిగత నంబర్ షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ వాట్సాప్ కనెక్టివిటీని సులభతరం చేయనుంది.
News November 5, 2025
కామారెడ్డి: జిజ్ఞాసలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టు పోటీల్లో అర్థశాస్త్ర విభాగంలో ప్రథమ బహుమతి సాధించారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు అర్చన, కావేరి, వందన, ముస్కాన్, భవిత, సృజన రాణించారు. మహిళలకు ఉచిత బస్సు మహాలక్ష్మి పథకం- జిల్లాలో ప్రభావం అనే అంశంపై రాష్ట్రస్థాయిలో బుధవారం ఉత్తమ బహుమతి అందుకున్నారు.
News November 5, 2025
మణుగూరులో 144 సెక్షన్.. ఇతర ప్రాంతాల్లో నిరసనకు పిలుపు

మణుగూరులో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఈనెల 7న తలపెట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడిని ఇతర నియోజకవర్గాల్లో చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. పినపాక మినహా 4 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని సూచించారు. పినపాక నియోజకవర్గంలోని 7 మండలాల అధ్యక్షులు ఎక్కడి వారు అక్కడే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.


