News November 5, 2025
KPHB: OYOలో పోలీసుల RAIDS

KPHBకాలనీలోని హోటళ్లలో అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తాజాగా రోడ్ నం.3లోని OYO హోటల్‌లో రైడ్స్ చేశారు. ఈ సోదాల్లో 6 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు కాకినాడకు చెందిన జ్యోతి, అజయ్ (27), రమేశ్ (28)గా గుర్తించారు. APలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. OYOలో రూమ్ అద్దెకు తీసుకొని మరీ వ్యాపారం మొదలుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
Similar News
News March 13, 2026
పొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

పొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారు, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,780
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,518
*వెండి 10 గ్రాముల ధర రూ.2,665
News March 13, 2026
రాష్ట్రాలకు శుభవార్త.. భారీగా నిధులు

AP సహా 6 రాష్ట్రాలు/UTకి ₹1,913Cr అదనపు నిధుల విడుదలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. 2025లో వరదలు, మొంథా తుఫాను నష్టానికి సాయంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. గుజరాత్‌కు ₹778Cr, APకి ₹341Cr, J&Kకు ₹330Cr, HPకి ₹288Cr, నాగాలాండ్‌కు ₹158Cr, ఛత్తీస్‌గఢ్‌కు ₹15Cr అందనున్నాయి. FY26లో SDRF కింద 28 రాష్ట్రాలకు ₹20,735Cr, NDRF కింద 21 రాష్ట్రాలకు ₹3,628Cr రిలీజ్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
News March 13, 2026
విజయవాడలో ప్రమాదం.. MBBS విద్యార్థి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల విద్యార్థి లిఖిత్ సాయి (MBBS) దుర్మరణం చెందారు. శ్రీకాళహస్తికి చెందిన ఆయన గురువారం రాత్రి రామవరప్పాడు నుంచి వస్తుండగా, పరిణయ కళ్యాణ మండపం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయారు. తలకు తీవ్ర గాయమవ్వడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణం నిలిచేదని స్థానికులు చెబుతున్నారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


