News April 11, 2024

జూన్ చివరి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు?

image

TG: జూన్ చివరి వారంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయని భువనగిరి లోక్‌సభ సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ చెప్పినట్లు సమాచారం. MP ఎన్నికల తర్వాత జూన్ ఫస్ట్ వీక్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, జూన్ చివరిలోపు ఎన్నికలు జరుగుతాయని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే సంక్షేమ పథకాల కోసం ఇందిరమ్మ కమిటీలు వేస్తామని, ప్రతి కమిటీ సభ్యునికి రూ.6వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తామన్నారట.

Similar News

News March 10, 2026

రజినీ-కమల్ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

image

రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనుండగా, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ మూవీ <<19199837>>ప్రోమో<<>> ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

News March 10, 2026

ట్రంప్ కామెంట్స్.. తగ్గిన క్రూడాయిల్ ధర

image

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే ముగుస్తుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన <<19341728>>వ్యాఖ్యలతో<<>> క్రూడాయిల్ ధర తగ్గింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $88కి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 23% తగ్గింది. ఆయిల్ ధరలను నియంత్రించేందుకు ట్రంప్ అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు అంతకుముందు వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఇరాన్‌పై దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఆయిల్ ధరలు 50% పెరిగాయి.

News March 10, 2026

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయింది: ట్రంప్

image

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని US ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగిసేందుకు 4-5 వారాల సమయం పడుతుందని అంచనా వేయగా, అంతకంటే ముందే పూర్తి కాబోతున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్‌కు ఇప్పుడు నేవీ, కమ్యూనికేషన్స్, ఎయిర్ ఫోర్స్ ఏవీ లేవని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ట్రంప్ ఫోన్‌ కాల్‌లో చర్చించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.