News November 5, 2025
గొల్లప్రోలు: మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి జైలు శిక్ష

గొల్లప్రోలుకు చెందిన మచ్చ రామ్మోహన్‌కు పోక్సో కోర్టు జడ్జి కె. శ్రీదేవి జైలు శిక్ష, జరిమానా విధించారు. 2017లో 17 ఏళ్ల అమ్మాయిని కళాశాల నుంచి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటనపై నమోదు అయిన కేసులో 8 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారని సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. వాదనలు, ప్రతివాదనల అనంతరం న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.
Similar News
News March 13, 2026
జీడిపప్పు, కోకో, కొబ్బరి పంటల అభివృద్ధికి రూ.708 కోట్లు

రాష్ట్రంలో తోట పంటలైన కొబ్బరి, జీడి, కోకో పంటలకు కేంద్రం రూ.708 కోట్లు అందించిందని కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి భగీరథ చౌదరి వెల్లడించారు. ఈ పంటలకు సంబంధించి శుక్రవారం రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 2.01 లక్షల హెక్టార్లలో జీడిపప్పు, 1.08 లక్షల హెక్టార్లలో కొబ్బరి, 47 వేల హెక్టార్లలో కోకో రాష్ట్రంలో సాగులో ఉందని మంత్రి వివరణ ఇచ్చారు.
News March 13, 2026
బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ చేపట్టనున్నారు. ఉదయం 7 గంటలకు మహాశక్తి ఆలయం వద్ద ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో బీజేపీకి చెందిన 108 మంది సర్పంచులు, 450 మంది వార్డు సభ్యులు, మేయర్, కౌన్సిలర్లు సహా ప్రజాప్రతినిధులు, వేలాదిగా కార్యకర్తలు పాల్గొననున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో సాగాలని సంజయ్ శ్రేణులకు సూచించారు.
News March 13, 2026
కరీంనగర్ పీటీసీలో పాసింగ్ అవుట్ పరేడ్

కరీంనగర్‌లోని స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రం (PTC)లో 2025–2026 బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ వైభవంగా జరిగింది. ఈ శిక్షణలో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి TGSP కానిస్టేబుల్ గోగికర్ రోహన్ ‘ఆల్ రౌండర్’ అవార్డును కైవసం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్యఅతిథిగా హాజరై రోహన్‌కు ట్రోఫీని అందజేసి, ప్రత్యేకంగా అభినందించారు.


