News November 5, 2025
వరంగల్: 95 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 95 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 53, సెంట్రల్ జోన్ పరిధిలో 18, వెస్ట్ జోన్ పరిధిలో 15 ఈస్ట్ జోన్ పరిధిలో 9 కేసులను పోలీసులు నమోదు చేశారు.
Similar News
News March 18, 2026
పశువులపై దాడులు.. పల్లెల్లో వణుకు.. పులి ఎక్కడ ఉందంటే?

అటవీశాఖకు సవాల్‌గా మారిన పెద్దపులి సంచారం బుధవారం 18వ రోజుకు చేరింది. ప్రస్తుతం శంఖవరం మండలం కొత్తంగి, కొత్తూరు సమీపంలో పులి ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. గత 17 రోజుల్లో 250 కిలోమీటర్లు సంచరించిన పులి, 15 పశువులపై దాడి చేసింది. దీన్ని పట్టుకునేందుకు 11 హనుమాన్ బృందాలు, 3 ట్రంక్విలైజింగ్ బృందాలు శ్రమిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

VZM: జిల్లా వాసులకు ముఖ్య గమనిక..!

జిల్లాలో గృహ అవసర గ్యాస్ సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్ తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని ఆయన సూచించారు.