News November 5, 2025
పంచాయతీ కార్యదర్శులపై కీలక నిర్ణయం

AP: గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టును గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్(GPDO)గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వేతనాల్లో మార్పుల్లేకుండా ప్రస్తుతమున్న 5 కేడర్‌లను నాలుగుకు కుదించింది. ఇకపై 7,224 క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు పనిచేయనున్నాయి. 359 అర్బన్, 3,082 గ్రేడ్-1, 3,163 గ్రేడ్-2, 6,747 గ్రేడ్-3 పంచాయతీలుగా వర్గీకరణ చేశారు. అదే మాదిరిగా ఉద్యోగుల కేడర్ మారింది.
Similar News
News November 5, 2025
ఏపీ న్యూస్ రౌండప్

✦ రాష్ట్రవ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB తనిఖీలు
✦ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చ.. సరిహద్దు మార్పులపై నివేదిక రెడీ చేయనున్న మంత్రులు.. NOV 10న క్యాబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజనపై చర్చ.. మదనపల్లె, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాల ప్రతిపాదనలు
✦ నకిలీ మద్యం కేసు CBIకి ఇవ్వాలంటూ హైకోర్టులో జోగి రమేశ్ పిటిషన్.. 12వ తేదీకి విచారణ వాయిదా
News November 5, 2025
మరి ఎందుకు అప్పీల్ చేయలేదు.. రాహుల్‌కు ఈసీ కౌంటర్

హరియాణాలో 25 లక్షల <<18204949>>ఓట్ల చోరీ<<>>జరిగిందని, అక్కడ 12.5% ఓట్లు నకిలీవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ ఖండించింది. అవి నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది. హరియాణాలో ఓటర్ల లిస్టుకు వ్యతిరేకంగా ఎలాంటి అప్పీళ్లు దాఖలు కాలేదని తెలిపింది. రివిజన్ టైమ్‌లో మల్టిపుల్ ఓట్లను నివారించేందుకు కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు అభ్యంతరాలు ఎందుకు లేవనెత్తలేదని EC వర్గాలు ప్రశ్నించాయి.
News November 5, 2025
రబీలో రాగులు(రాగి) సాగు – అనువైన రకాలు

రబీలో రాగి పంటను నవంబర్-డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు.తేలిక రకం ఇసుక నేలలు, బరువు నేలల్లో విత్తుకోవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనుకూలం కాదు. గోదావరి, రత్నగిరి, సప్తగిరి, మారుతి, చంపావతి, భారతి, శ్రీచైతన్య, వకుళ, హిమ, తిరుమల, వేగవతి, సువర్ణముఖి, గౌతమి, ఇంద్రావతి వంటి రకాలు ఖరీఫ్, రబీకి అనువైన రాగి పంట రకాలు. ఎకరాకు నారుకోసం 2.5 కిలోల విత్తనం, వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరం.


