News November 5, 2025
VJA: బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా శ్రీకాకుళం(CHE)- బెంగళూరు కంటోన్మెంట్(BNC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.08553 CHE- BNC రైలు ఈ నెల 21న రాత్రి 11.35కి విజయవాడ, తర్వాత రోజు మధ్యాహ్నం 2.45కు BNC చేరుకుంటుందన్నారు. నం. BNC- CHE రైలు ఈ నెల 24న మధ్యాహ్నం 2కి బెంగళూరులో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7కు విజయవాడ, సాయంత్రం 5కు శ్రీకాకుళం చేరుకుంటుందన్నారు.
Similar News
News November 5, 2025
HYD: T-Hub దశాబ్దపు విజయం: KTR

5 NOV 2015న T-Hub ఆవిర్భావంతో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ భారతదేశపు స్టార్టప్ రాజధానిగా నిలిచిందని KTR ‘X’ లో పోస్ట్ చేశారు. T-Hubతో మొదలై We-Hub, T-Works వంటి సంస్థలతో కూడిన ఈ అద్భుతమైన ఎకోసిస్టమ్‌ను ‘ఆధునిక భారతదేశానికి ముఖచిత్రం’ అన్న రతన్ టాటా వ్యాఖ్యలను గుర్తుచేశారు. గత దశాబ్దంలో T-Hub సాధించిన ఈ ఘనత తనకు గర్వకారణమని రాసుకొచ్చారు.
News November 5, 2025
వికారాబాద్: పూడూరుకు ఇండియన్ క్రికెటర్

వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి ఈరోజు ఇండియన్ క్రికెటర్, డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ వచ్చారు. పూడూర్ మండలం పెద్ద ఉమ్మెంతల్ గ్రామంలో తాను కొన్న 2.35 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చారు. దీంతో మండల కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ను చూసేందుకు స్థానిక యువత MRO ఆఫీస్‌కు వచ్చారు. MRO విజయ్ కుమార్ సిరాజ్‌ను సన్మానించారు.
News November 5, 2025
చివరకు దళారులను ఆశ్రయించాల్సిందేనా..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు నాంపల్లి, సంకేపల్లి, సుద్దాల, తాళ్లపల్లి, గాలిపెల్లిలోని జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసిన సీసీఐ ఈసారి గరిష్ఠంగా ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయనుండడంతో మిగతా పత్తిని అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయించాల్సిందేనా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


