News November 5, 2025
రామగుండం: ముడి సరుకుల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

రామగుండం ఐటీఐలో వివిధ ట్రేడ్స్‌లో అవసరమైన ముడి సరుకుల కొనుగోలుకు రూ.6.48 లక్షల వ్యయంతో టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ ఈ.సురేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 196 రకాల ముడి సరుకులు ఒకే ప్యాకేజీగా సరఫరా చేయడానికి ఆసక్తిగల సంస్థలు దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు రామగుండం ఐటీఐ ప్రిన్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
Similar News
News November 5, 2025
ఈనెల 7న మెగా జాబ్ మేళా

AP: విజయనగరం జిల్లాలోని AGL డిగ్రీ కాలేజీలో AP స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, PG ఉత్తీర్ణులైన, 18- 35ఏళ్ల మధ్య వయసుగలవారు హాజరు కావొచ్చు. ముందుగా naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ జాబ్ మేళాలో 12 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనున్నాయి.
News November 5, 2025
ఆరుట్ల బుగ్గ జాతరకు బస్ రూట్లు ఇవే..!

దక్షిణ కాశీగా పిలువబడే ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వరుడి జాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హజరై మొక్కులు తీర్చుకుంటారు. బుగ్గ జాతరకు రావడానికి HYD నుంచి ఇబ్రహీంపట్నం, యాచారం- మాల్ ప్రాంతాల నుంచి గున్‌గల్, రంగాపూర్-జాపాల మీదుగా చేరుకోవచ్చు. చౌటుప్పల్, రాచకొండ మీదుగా జాతరకు వెళ్లొచ్చు. ఇబ్రహీంపట్నం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
News November 5, 2025
ప్రపంచకప్ గుర్తుండిపోవాలని..

భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ నెగ్గి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజయం గుర్తుండిపోవాలని చేయిపై వరల్డ్ కప్ టాటూను వేయించుకున్నారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన చర్మంతోపాటు హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. ‘తొలి రోజు నుంచే నీ కోసం ఎదురుచూశా. ఇకపై ప్రతి రోజూ నిన్ను చూసుకుంటా. కృతజ్ఞతతో ఉంటా’ అని రాసుకొచ్చారు.


