News November 5, 2025
సిక్కుల ఆరాధ్య దైవం మన గుంటూరు వచ్చారని తెలుసా?

గుంటూరు జిల్లాలో సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ సందర్శించిన ప్రదేశంగా ‘గురుద్వారా పెహ్లీ పాట్షాహీ’ గుర్తింపు పొందింది. రెండవ ఉదాసి (1506–1513) కాలంలో గురునానక్ దక్షిణ భారత పర్యటనలో గుంటూరును సందర్శించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఆయన ప్రసంగాలతో ప్రభావితమై ఏర్పడిన ఈ గురుద్వారా ఆధ్యాత్మిక చరిత్రలో ముఖ్య స్థావరంగా నిలిచింది. 19వ శతాబ్దంలో తీర్థయాత్రికులు ఈ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేశారు.
Similar News
News March 16, 2026
GNT: రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ మృతి

విజయవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరుకు చెందిన ప్రదీప్ రాజ్ (41) ఏలూరులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పెనుగంచిప్రోలు నుంచి ఏలూరు వెళ్తుండగా పిల్లలకు టిఫిన్ తినిపించేందుకు కారు ఆపారు. తిరిగి బయలుదేరుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కళ్ల ముందే తండ్రి మరణించడంతో చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 16, 2026
GNT: మిద్దెతోట సాగుదారులకు ఈ నెల 21న పురస్కారాలు

ప్రకృతిపై ప్రేమతో మిద్దెతోటలను పెంచుతున్న వారికి పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ ఈ నెల 21న పురస్కారాలు ప్రదానం చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 30 మంది మిద్దెతోట పెంపకందారులను ఎంపిక చేశారు. వారికి పురస్కారాలు అందించనున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు.
News March 16, 2026
GNT:”ఎస్పీ ఆఫీస్ లో పీజీఆర్ఎస్ రద్దు”

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం రద్దైంది.
పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రజలు విషయాన్ని గమనించి ఎస్పీ కార్యాలయానికి వచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని SP వకుల్ జిందాల్ సూచించారు. తదుపరి జరిగే పీజీఆర్ఎస్ వివరాలను ముందు రోజు వెళ్లడిస్తామని చెప్పారు.


