News November 5, 2025

‘మీర్జాగూడ’ ప్రమాదం.. బస్సును 60 మీటర్లు ఈడ్చుకెళ్లిన టిప్పర్

image

TG: రంగారెడ్డి(D) మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేగంగా దూసుకొచ్చిన కంకర టిప్పర్.. బస్సును ఢీకొట్టిన తర్వాత 50-60M ఈడ్చుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. బ్రేక్ వేయకపోవడం లేదా పడకపోవడం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 24 మంది చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Similar News

News November 5, 2025

రబీలో రాగులు(రాగి) సాగు – అనువైన రకాలు

image

రబీలో రాగి పంటను నవంబర్-డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు.తేలిక రకం ఇసుక నేలలు, బరువు నేలల్లో విత్తుకోవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనుకూలం కాదు. గోదావరి, రత్నగిరి, సప్తగిరి, మారుతి, చంపావతి, భారతి, శ్రీచైతన్య, వకుళ, హిమ, తిరుమల, వేగవతి, సువర్ణముఖి, గౌతమి, ఇంద్రావతి వంటి రకాలు ఖరీఫ్, రబీకి అనువైన రాగి పంట రకాలు. ఎకరాకు నారుకోసం 2.5 కిలోల విత్తనం, వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరం.

News November 5, 2025

ఈనెల 7న మెగా జాబ్ మేళా

image

AP: విజయనగరం జిల్లాలోని AGL డిగ్రీ కాలేజీలో AP స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, PG ఉత్తీర్ణులైన, 18- 35ఏళ్ల మధ్య వయసుగలవారు హాజరు కావొచ్చు. ముందుగా naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ జాబ్ మేళాలో 12 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనున్నాయి.

News November 5, 2025

ప్రపంచకప్ గుర్తుండిపోవాలని..

image

భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ నెగ్గి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజయం గుర్తుండిపోవాలని చేయిపై వరల్డ్ కప్ టాటూను వేయించుకున్నారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన చర్మంతోపాటు హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. ‘తొలి రోజు నుంచే నీ కోసం ఎదురుచూశా. ఇకపై ప్రతి రోజూ నిన్ను చూసుకుంటా. కృతజ్ఞతతో ఉంటా’ అని రాసుకొచ్చారు.