News November 5, 2025
రోడ్డు ప్రమాదం.. నలుగురు TG వాసుల మృతి

కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి(D) జగన్నాథ్‌పూర్ వాసులుగా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ‘మీర్జాగూడ’ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Similar News
News November 5, 2025
రబీలో రాగులు(రాగి) సాగు – అనువైన రకాలు

రబీలో రాగి పంటను నవంబర్-డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు.తేలిక రకం ఇసుక నేలలు, బరువు నేలల్లో విత్తుకోవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనుకూలం కాదు. గోదావరి, రత్నగిరి, సప్తగిరి, మారుతి, చంపావతి, భారతి, శ్రీచైతన్య, వకుళ, హిమ, తిరుమల, వేగవతి, సువర్ణముఖి, గౌతమి, ఇంద్రావతి వంటి రకాలు ఖరీఫ్, రబీకి అనువైన రాగి పంట రకాలు. ఎకరాకు నారుకోసం 2.5 కిలోల విత్తనం, వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరం.
News November 5, 2025
ఈనెల 7న మెగా జాబ్ మేళా

AP: విజయనగరం జిల్లాలోని AGL డిగ్రీ కాలేజీలో AP స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, PG ఉత్తీర్ణులైన, 18- 35ఏళ్ల మధ్య వయసుగలవారు హాజరు కావొచ్చు. ముందుగా naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ జాబ్ మేళాలో 12 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనున్నాయి.
News November 5, 2025
ప్రపంచకప్ గుర్తుండిపోవాలని..

భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ నెగ్గి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజయం గుర్తుండిపోవాలని చేయిపై వరల్డ్ కప్ టాటూను వేయించుకున్నారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన చర్మంతోపాటు హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. ‘తొలి రోజు నుంచే నీ కోసం ఎదురుచూశా. ఇకపై ప్రతి రోజూ నిన్ను చూసుకుంటా. కృతజ్ఞతతో ఉంటా’ అని రాసుకొచ్చారు.


