News November 5, 2025

సిరిసిల్ల: ‘CCI కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి’

image

CCI కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి పత్తికి మద్దతు ధర పొందాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేములవాడ పరిధిలో రెండు, కోనరావుపేటలో ఒకటి, ఇల్లంతకుంట మండలంలో రెండు, మొత్తం 5 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News March 21, 2026

‘యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా గళమెత్తాలి’

image

కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో శనివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచశాంతి కోరుకుంటూ సమావేశం నిర్వహించారు. సాహితీ స్రవంతి ప్రచురించిన ఉగాది ప్రత్యేక సంచిక ‘సాహిత్య ప్రస్థానం’ను ఆవిష్కరించారు. నంది అవార్డు గ్రహీత మహమ్మద్ మియా మాట్లాడుతూ.. యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు కలమెత్తి, గలమెత్తాలని పిలుపునిచ్చారు. ఇనాయతుల్లా, స్వర్ణలత పాల్గొన్నారు.

News March 21, 2026

భద్రాద్రి: ఇద్దరి దుర్మరణం.. నలుగురికి గాయాలు

image

ఇల్లందు మండలం మసివాగు గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కారు, ఆటో వేగంగా ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2026

HYD: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా!

image

మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈనెల 13న దొడ్ల ప్రతాప్ గ్రూప్ డైరెక్టర్ దివ్యరెడ్డి అకౌంటెంట్‌కు వాట్సాప్‌లో డబ్బులు పంపాలని మెసేజ్ వచ్చింది. డైరెక్టర్ దివ్యరెడ్డి ఫొటో డీపీ ఉండటంతో అకౌంటెంట్ దాంట్లో సూచించిన ఖాతాకు రూ.1.20 కోట్లు బదిలీ చేశారు. మరోసారి డబ్బులు పంపించాలని సూచించడంతో మోసం బయట పడింది. వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.