News November 5, 2025

మిడ్ డే మీల్.. రేట్లు పెంపు

image

TG: స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి అందించే ధరలను పెంచుతూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఇచ్చే రూ.5.45ను రూ.6.19కి, ప్రాథమికోన్నత స్కూళ్లలో రూ.8.17 నుంచి రూ.9.29కి పెంచారు. 9,10వ తరగతుల విద్యార్థులకు రూ.10.67 నుంచి రూ.11.79కి పెంచారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో పీఎం పోషణ్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.

Similar News

News March 20, 2026

సర్‌ప్రైజ్ ఇస్తామన్నాడు.. కొన్ని గంటల్లోనే చంపేశారు

image

ట్రంప్, నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ దాడుల్లో IRGC కీలక ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్ నయినీ మరణించారు. అంతకుముందు ‘మా దగ్గర క్షిపణుల నిల్వలు చాలా ఉన్నాయి. శత్రువుకు సర్‌ఫ్రైజ్‌లు ఇస్తాం’ అని నెతన్యాహును ఉద్దేశించి అలీ వ్యాఖ్యానించారు. ఇరాన్ నౌకాదళాన్ని ధ్వంసం చేశామన్న ట్రంప్ కామెంట్లపైనా స్పందిస్తూ ‘ఆయనకు ధైర్యముంటే పర్షియన్ గల్ఫ్‌లోకి నౌకలను పంపాలి’ అంటూ సవాల్ విసిరారు.

News March 20, 2026

లైంగిక వాంఛలు తీర్చకపోతే భర్త చనిపోతాడంటూ..

image

నాసిక్ (MH) <<19426361>>జ్యోతిషుడు<<>> అశోక్ కారత్ (67) కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ‘మంచి భర్త దొరకాలని 2022లో ఓ యువతి సంప్రదించింది. ఆమెకు ఓ తాయత్తు ఇచ్చి తీయవద్దని చెప్పాడు. పరీక్ష కోసం తీయగా వారంలో పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది. దీంతో ఆమెకు నమ్మకం పెరిగింది. ఇదే అదనుగా అశోక్ మత్తుమందు ఇచ్చి రేప్ చేశాడు. లైంగిక వాంఛలు తీర్చకపోతే భర్త చనిపోతాడంటూ 2025 వరకు వేధించాడు’ అని పోలీసులు తెలిపారు.

News March 20, 2026

జొమాటో కస్టమర్లకు షాక్.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు

image

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కస్టమర్లకు షాకిచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును ఆర్డర్‌పై రూ.2.40 చొప్పున పెంచింది. దీంతో రూ.12.50 నుంచి రూ.14.90కి పెరిగింది. పోటీ కంపెనీ స్విగ్గీ ఇప్పటికే ఆర్డర్‌పై రూ.14.99 చొప్పున వసూలు చేస్తోంది. ఇంధన ధరలు పెరిగిన కారణంగానే ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచినట్లు తెలుస్తోంది. దీనివల్ల డెలివరీ పార్ట్‌నర్లతోపాటు రెస్టారెంట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.