News November 5, 2025
అమ్రాబాద్: ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

అమ్రాబాద్ మండలంలోని వటవర్లపల్లి సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అక్కమహాదేవి మలుపు వద్ద అతివేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులను బయటపడ్డారు. బస్సు రోడ్డుపై అడ్డుగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయినట్లు ప్రయాణికులు తెలిపారు.
Similar News
News November 5, 2025
బాపట్లలో కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

బాపట్ల పట్టణంలోని మరుప్రోలు వారి పాలెం గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై బుధవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 5, 2025
తిరుమలలో మహిళ మృతి.. ఈమె మీకు తెలుసా?

తిరుమల మెయిన్ కళ్యాణకట్ట ఎదురుగా ఓపెన్ షెడ్‌లో ఓ మహిళకు ఫిట్స్ వచ్చాయి. వెంటనే అశ్విని ఆసుపత్రికి అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఆమె పేరు ఏ.మంగ(40) అని మాత్రమే తెలిసింది. ఎవరైనా ఈ మహిళను గుర్తిస్తే తిరుమల వన్ టౌన్ పోలీసులను 9440796768, 9440796771, 0877-2289027 నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.
News November 5, 2025
సంగారెడ్డి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నిరుద్యోగ గ్రామీణ యువతకు టూవీలర్ మెకానిక్ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం(RSETI) డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండి వయస్సు 19- 40 మధ్య ఉండాలి. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు బైపాస్ రహదారిలోని కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


