News November 5, 2025
బ్యాంకులకు ధీటుగా ఆన్లైన్ సేవలు అందిస్తాం: గన్ని వీరాంజనేయులు

ఏలూరు క్రాంతి కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహా జనసభను డీసీసీబీ సీఈఓ సింహాచలం అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వంతో సిబ్బంది కుమ్మక్కై సహకార సంఘాన్ని నష్టాల బాట పట్టించారని తీవ్రంగా విమర్శించారు. 2 నెలల్లో కమర్షియల్ బ్యాంకులకు దీటుగా ఆన్లైన్ సేవలు అందిస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
Similar News
News November 5, 2025
బాపట్లలో కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

బాపట్ల పట్టణంలోని మరుప్రోలు వారి పాలెం గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై బుధవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 5, 2025
తిరుమలలో మహిళ మృతి.. ఈమె మీకు తెలుసా?

తిరుమల మెయిన్ కళ్యాణకట్ట ఎదురుగా ఓపెన్ షెడ్‌లో ఓ మహిళకు ఫిట్స్ వచ్చాయి. వెంటనే అశ్విని ఆసుపత్రికి అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఆమె పేరు ఏ.మంగ(40) అని మాత్రమే తెలిసింది. ఎవరైనా ఈ మహిళను గుర్తిస్తే తిరుమల వన్ టౌన్ పోలీసులను 9440796768, 9440796771, 0877-2289027 నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.
News November 5, 2025
సంగారెడ్డి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నిరుద్యోగ గ్రామీణ యువతకు టూవీలర్ మెకానిక్ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం(RSETI) డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండి వయస్సు 19- 40 మధ్య ఉండాలి. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు బైపాస్ రహదారిలోని కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


