News November 5, 2025

కొనరావుపేట: అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభ్యం

image

కొనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్లో అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 31న నిజామాబాద్‌కు చెందిన బద్దెపురి నారాయణ(80) కనిపించకుండా పోయాడు. వృద్ధుడి కుమారుడు నవంబర్ 3న కొనరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన వృద్ధుడి మృతదేహం రిజర్వాయర్లో కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News March 13, 2026

HYD: ఇంటిపై కూరగాయల సాగు నేర్చుకుంటారా?

image

జంటనగరాల్లో ఇంటి పైకప్పులు, బాల్కనీలో కూరగాయలు పెంచాలనుకునే వారికి ఉద్యానశాఖ శిక్షణ ఇవ్వనుంది. అర్బన్ ఫార్మింగ్ పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అర్బన్ ఫార్మింగ్ విభాగం సంచాలకులు రామలక్ష్మి తెలిపారు. ఈ శిక్షణ మార్చి 14న నాంపల్లిలోని ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఉ.10 గంటల నుంచి మ.ఒంటి గంట వరకు జరుగుతుంది. వివరాలకు 8977714411 ఈ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.# SHARE IT

News March 13, 2026

ధర్మవరం: 14 ఏళ్ల తర్వాత ఇంటికి..!

image

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన పరమేశ్, లక్ష్మీదేవమ్మ కుమారుడు నాగార్జున చదువుకోవడం ఇష్టం లేక 10thలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బెంగళూరులో కొత్త కాలం ఉన్నాడు. శాంతిపురానికి చెందిన బాబా అతడిని తెచ్చి పెంచుకున్నాడు. బాబా తమ రేషన్ కార్డులో అతని పేరు చేర్చడంతో కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్నట్లు తెలిసింది. TDP నేతల సహకారంతో నాగార్జునను 14 ఏళ్ల తర్వాత తమ ఇంటికి తీసుకెళ్లారు.

News March 13, 2026

‘క్రీమీ లేయర్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

OBC రిజర్వేషన్ల కోసం క్రీమీ లేయర్ హోదాను తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి మాత్రమే నిర్ణయించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయా సంస్థల్లో వారి పదవులు, హోదానూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సివిల్స్ పరీక్షను క్లియర్ చేసినా క్రీమీ లేయర్‌లో పొరపాటున చేర్చడంతో నష్టపోయిన అభ్యర్థులకు ఊరట కల్పించింది. వారి అపాయింట్‌మెంట్స్‌ను నిరాకరిస్తూ కేంద్రం వేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.