News November 5, 2025
కోటవురట్ల: రాజీనామా చేసిన వైసీపీ నేతకు బుజ్జగింపులు

కోటవురట్ల మండల వైసీపీ అద్యక్ష పదవికి రాజీనామా చేసిన కిలాడ శ్రీనివాసరావుని పలువురు నేతలు బుజ్జగిస్తున్నారు. ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఫోన్‌లో మాట్లాడి తొందర పడవద్దని సూచించారు. బుధవారం ఉదయం నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. దత్తుడు సీతబాబు పాల్గొన్నారు.
Similar News
News March 28, 2026
IPL 2026: కోహ్లీ ముందున్న 5 అరుదైన రికార్డులు

IPLలో కోహ్లీ పలు రికార్డులపై కన్నేశారు. 339 రన్స్ సాధిస్తే 9,000 IPL పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తారు. అలాగే ఒకే జట్టు (RCB) తరపున 10,000 T20 రన్స్, 300 సిక్సర్లు బాదిన ఫస్ట్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. భారత్‌లో 10,000 T20 రన్స్ మైల్‌స్టోన్‌కు కేవలం 296 పరుగుల దూరంలో ఉన్నారు. ఒకే వేదికపై (చిన్నస్వామి స్టేడియం) హయ్యెస్ట్ రన్స్ రికార్డును మరింత మెరుగుపరుచుకోనున్నారు.
News March 28, 2026
జగిత్యాల: ఆశావర్కర్ల ముందస్తు అరెస్టు

తమ సమస్యల పరిష్కారం కోసం శనివారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌కు బయలుదేరుతున్న ఆశావర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
News March 28, 2026
KNR: మిగిలింది మూడు రోజులే.. ‘దళపతి’ ఎక్కడ.?

కేంద్ర మంత్రి అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో జగిత్యాల(D) బీర్పూర్‌కు చెందిన ముప్పాల లక్ష్మణరావు @గణపతి లొంగుబాటుపై సస్పెన్స్ విడడం లేదు. నేపాల్ లో గణపతిని అదుపులోకి తీసుకున్నారని, HYDలో CM రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోతారనే వార్తలు సైతం వెలుగులోకి వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కగార్ డెడ్లైన్ ఇంకా 3రోజులే మిగిలి ఉంది.


