News November 5, 2025
BSNL ఫైబర్.. బేసిక్ ప్లాన్ కేవలం రూ.399!

సరసమైన రీఛార్జ్ ప్యాక్స్‌తో యూజర్లను ఇంప్రెస్ చేస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను అందిస్తోంది. BSNL తమ ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను కేవలం ₹399గా నిర్ణయించింది. దీంతో 60 Mbps వేగంతో నెలకు 3300 GB డేటాను పొందగలరు. ఆ తర్వాత 4Mbps వేగంతో డేటా లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో మొదటి నెల ఉచితం కాగా.. తొలి 3 నెలలు ప్లాన్‌పై అదనంగా ₹100 తగ్గింపు ఉంటుంది.
Similar News
News March 21, 2026
గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్!

ఏప్రిల్, మే, జూన్ నెలల ఉచిత రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు రాష్ట్రాలకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు లబ్ధిదారులకు అధికారికంగా సమాచారం అందించే అవకాశం ఉంది. రాబోయే 3 నెలలు ఎండల తీవ్రత, గోదాముల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వర్షాకాలంలోనూ ఇలాగే పంపిణీ చేసింది.
News March 21, 2026
రోహిత్‌ను MI పూర్తిగా వాడుకోవాలి: ఇర్ఫాన్

స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించారు. ‘రోహిత్‌ను MI ఎలా యూజ్ చేసుకుంటుందనేది కీలకం. ఇంపాక్ట్ ప్లేయర్‌లా కాకుండా అతడు గ్రౌండ్‌లో ఉండటం చాలా ముఖ్యం. కెప్టెన్‌కు సాయపడగలడు. విజయవంతమైన సారథిని వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలి’ అని సూచించారు. గత IPLలో రోహిత్ భారీగా పరుగులు చేశారని, ఈసారి ఇంకా మెరుగ్గా ఆడతారని అన్నారు.
News March 21, 2026
TDP మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం TDP మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి(81) కన్నుమూశారు. అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈయన ఉమ్మడి అనంతపురం జిల్లా TDP అధ్యక్షుడిగా 10 ఏళ్లు పనిచేశారు. పంచాయతీ వార్డు సభ్యుడి స్థాయి నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎదిగారు. అటు ఉమ్మడి ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా పని చేశారు. ఈయన మృతిపట్ల ఆ పార్టీ నేతలు సంతాపం తెలిపారు.


