News November 5, 2025
10ఏళ్లలో 10 మంది కబడ్డీ ప్లేయర్ల హత్య

పంజాబ్‌లో కబడ్డీ ప్లేయర్ గుర్వీందర్ సింగ్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. శత్రువులందరికీ ఇదే తమ హెచ్చరిక అని SMలో పోస్టు చేసింది. ‘మీ దారులు మార్చుకోండి లేదా గుండెలో బుల్లెట్ దించుకోవడానికి రెడీగా ఉండండి’ అని పేర్కొంది. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు 2016 నుంచి డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్స్, క్రైమ్‌తో సంబంధమున్న 10 మంది కబడ్డీ ప్లేయర్లు హత్యకు గురికావడం గమనార్హం.
Similar News
News March 4, 2026
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రకటించిన తేదీ(మార్చి 26) కంటే వారం ముందే రిలీజయ్యే అవకాశముంది. ఈ నెల 19న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక BGM కోసం దేవిశ్రీప్రసాద్ స్థానంలో తమన్‌ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు.
News March 4, 2026
సుప్రీం లీడర్‌గా ఎవరిని ఎన్నుకున్నా లేపేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎవరిని ఎన్నుకున్నా వారిని చంపేస్తామని ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ పగ్గాలు చేపట్టే ఏ నేత అయినా తమకు ‘క్లియర్ టార్గెట్’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు. ఈ మిషన్‌ను పూర్తి చేయడానికి సిద్ధం కావాలని IDFను ఆదేశించినట్లు తెలిపారు. దివంగత అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.
News March 4, 2026
చరిత్ర సృష్టించిన T20WC

T20WC-2026 ఘన విజయం సాధించినట్లు ICC ఛైర్మన్ జై షా వెల్లడించారు. ‘క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తం చేసే లక్ష్యంతో ఈ వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఇండియాలో WC వీక్షకుల సంఖ్య 500 మిలియన్లను దాటింది. ఏ T20WCకైనా ఇదే అత్యధికం. జియో హాట్‌స్టార్‌లోనూ 60.5 మిలియన్ల గరిష్ఠ స్థాయికి వ్యూయర్ల సంఖ్య చేరింది. ఇవాళ్టి నుంచి జరిగే సెమీస్ మ్యాచ్‌లు మరిన్ని రికార్డులు బద్దలు కొడతాయని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.


