News November 5, 2025

ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం: వైసీపీ

image

ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైసీసీ X ఖాతాలో పేర్కొంది. మద్యం తాగించి..లైంగిక దాడికి పాల్పడినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలిక ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు వైసీసీ ట్వీట్ చేసింది. ఈ ఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందనేది తెలియాల్సి ఉంది.

Similar News

News March 17, 2026

ఉపాధి హామీ చట్టంపై నీలినీడలు: వైఎస్ షర్మిల

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వీబీజీ రాంజీ చట్టం వల్ల ఉపాధి హామీ పథకం కాంట్రాక్టర్ల పరమవుతుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అరకులోయ మండలం మాడగడలో జరిగిన MGNREGA చట్టం పరిరక్షణ యాత్ర సభలో ఆమె మాట్లాడారు. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రాలు 40% నిధులు భరించడం అసాధ్యమని, ఇది పేదల పొట్ట కొట్టడమేనని విమర్శించారు. కూలీల హక్కులను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.

News March 17, 2026

కామారెడ్డి: జనగణన ఆధారంగా ప్రభుత్వ పథకాలు

image

జనగణన ఆధారంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల ప్రణాళికలు రూపొందిస్తారని అదనపు కలెక్టర్ మధుమోహన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఛార్జ్ అధికారులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News March 17, 2026

ఖమ్మం: అనర్హులకే ఇళ్ల స్థలాలా..? కలెక్టరేట్ వద్ద ధర్నా

image

వెలుగుమట్ల భూముల్లో అనర్హులకు స్థలాలు కేటాయించడాన్ని నిరసిస్తూ CPI(ML) ఆధ్వర్యంలో బాధితులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 2018 నుంచి అక్కడ నివసిస్తున్న 400 మంది అసలైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితాను పునఃపరిశీలించి, అర్హులైన వారికే ఇళ్లు ఇవ్వాలని కోరుతూ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.