News April 11, 2024
తమిళనాడులో లోకేశ్ ప్రచారం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలై తరఫున ఆయన ఇవాళ, రేపు ఓట్లు అభ్యర్థించనున్నారు. కోయంబత్తూరులో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో లోకేశ్ రోడ్‌షోల్లో పాల్గొంటారు. అనంతరం తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.
Similar News
News April 17, 2026
‘అక్షయ తృతీయ’ ఏ రోజున చేసుకోవాలి?

హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. ఏటా వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథి రోజు దీన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ తిథి ఏప్రిల్ 19న 10.49AMకు మొదలై మరుసటి రోజు 7.27AMకు ముగుస్తుంది. అందువల్ల 19వ తేదీనే పండుగ జరుపుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆ రోజున 10.49AM-12.20PM మధ్య పూజకు మంచి సమయమని పేర్కొంటున్నారు.
News April 17, 2026
సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానమిదే!

APలో జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభమైంది. ప్రజలు se.census.gov.in పోర్టల్‌లో ఇంటిపెద్ద పేరు, మొబైల్ నంబర్, OTPతో లాగిన్ అయి జిల్లా, పిన్ కోడ్, గ్రామం/ పట్టణం వివరాలివ్వండి. మ్యాప్‌లో ఇంటి లొకేషన్ గుర్తించి, అడిగిన ప్రశ్నలన్నీ పూర్తి చేయాలి. ‘Final Submit’ చేయగానే Hతో మొదలయ్యే 11 అంకెల SE ID వస్తుంది. గణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని చూపిస్తే సరిపోతుంది. ఈనెల 30 వరకూ చేయవచ్చు.
News April 17, 2026
తాత్కాలిక సీజ్‌ఫైర్‌లు మాకొద్దు: ఇరాన్

లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10రోజుల సీజ్‌ఫైర్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. లెబనాన్ నుంచి మొదలుకొని ఎర్రసముద్రం వరకు ఈ ఏరియాలో ఎలాంటి అశాంతి లేకుండా ఉండటమే తమకు కావాలని స్పష్టం చేసింది. తాత్కాలిక సీజ్‌ఫైర్‌లను ఒప్పుకోబోమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న హింస ఇక్కడితో శాశ్వతంగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ వెల్లడించారు.


