News November 5, 2025

శివాలయంలో ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యేక పూజలు

image

అన్నపురెడ్డిపల్లి శివాలయాన్ని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించారు. కార్తీక్ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఆయన వెంట కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

Similar News

News November 5, 2025

రేపు వరంగల్ మార్కెట్ OPEN

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. నేడు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. ఈ క్రమంలో మార్కెట్ రేపు ప్రారంభం అవుతుండగా… రైతులు నాణ్యమైన, తేమలేని పత్తిని సరుకులను మార్కెట్కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.

News November 5, 2025

నెల్లూరు: రేపే నారా లోకేశ్ రాక

image

నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ పర్యటన ఖారారైంది. ఆయన గురువారం దగదర్తికి రానున్నారు. దివంగత ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. సంబంధిత ఏర్పాట్లను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కావలి డీఎస్పీ శ్రీధర్ బుధవారం పరిశీలించారు.

News November 5, 2025

ప్రతాపసింగారం: పంచవృక్షాల మహిమాన్వితం.. శైవక్షేత్రం

image

మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలోని శివాలయం విశిష్టతతో భక్తుల మనసును ఆకట్టుకుంటోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ దేవాలయంలో రావి, మేడి, వేప, ఉసిరి, జమ్మి పంచవృక్షాలు ఒకేస్థలంలో పెరిగాయి. ఈ 5 వృక్షాలు సాక్షాత్ దైవతత్త్వాన్ని ధారపోస్తూ ఆ ప్రదేశాన్ని పవిత్ర శక్తిక్షేత్రంగా మార్చేశాయి. ఆధ్యాత్మిక తేజస్సు విరజిమ్మే ఈ ప్రాంగణంలో కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే శుభఫలాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.