News November 5, 2025
ఏలూరులో డెడ్ బాడీ కలకలం

ఏలూరు నగరంలోని ఓ మురుగు కాలువలో బుధవారం మృతదేహం కలకలం రేపింది. ఒకటో పట్టణ పరిధిలోని పాండురంగ థియేటర్ సమీపంలో డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. మృతదేహం నీటిపై తేలి ఆడుతూ ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకటో పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 12, 2026
సంగారెడ్డి: 730 మంది విద్యార్థులు గైర్హాజరు

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 18,911 మంది విద్యార్థులకు గాను 18,181 మంది (96.14%) హాజరయ్యారని, 730 మంది ఆబ్సెంట్ అయ్యారని జిల్లా విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారని ఆయన పేర్కొన్నారు.
News March 12, 2026
అల్లూరి జిల్లాలో 4 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు

ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలకు ఉమ్మడి అల్లూరి జిల్లాలో 4 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 8 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ గురువారం తెలిపారు. జిల్లాలో 72 సెంటర్స్‌కు సంబంధించిన సెట్ 1,2 ప్రశ్నపత్రాలు పోలిస్స్టేషన్‌లో భద్రపరిచామన్నారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా నిరంతరాయంగా తనిఖీలు ఉంటాయన్నారు. 11,457మంది పరీక్షలు రాస్తారన్నారు.
News March 12, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు 96.71 % హాజరు

మెదక్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6085 మందికి గాను 5895 మంది, ఒకేషనల్ విభాగంలో 279 మందికి గాను 260 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 96.71% హాజరు నమోదైంది. నేటితో మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.


