News November 5, 2025
SRPT: కారు బోల్తా.. మహిళ మృతి, ఇద్దరికి గాయాలు

కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన మోతె మండలం మామిళ్లగూడెం దగ్గర జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు పల్టీ కొట్టి పక్కకు పడిపోయింది. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2025
కరీంనగర్: బండి సంజయ్ కీలక నిర్ణయం..!

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ టెన్త్ ఎగ్జామ్ ఫీజు పూర్తిగా చెల్లించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సిద్ధమయ్యారు. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12,292మంది విద్యార్థులందరికీ తానే స్వయంగా పరీక్ష ఫీజు చెల్లిస్తానని తెలిపారు. రూ.15లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
News November 5, 2025
ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమోరాలు తప్పనిసరి: కలెక్టర్

ప్రైవేటు దేవాలయాల్లో రోజులో కనీసం వెయ్యిమంది భక్తులు హాజరయ్యే దేవాలయాల వద్ద CC కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో ఆలయాల భద్రతపై బుధవారం సమీక్ష జరిపారు. ఆయా మండలాల్లో ప్రైవేట్ ఆలయాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. కెమెరాల ఏర్పాటును దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
News November 5, 2025
రేపు వరంగల్ మార్కెట్ OPEN

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. నేడు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. ఈ క్రమంలో మార్కెట్ రేపు ప్రారంభం అవుతుండగా… రైతులు నాణ్యమైన, తేమలేని పత్తిని సరుకులను మార్కెట్కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.


