News November 5, 2025
విశాఖ: కనెక్షన్ కావాలంటే చేయి తడపాల్సిందే

GVMC పరిధిలో తాగునీటి కనెక్షన్ల ఏర్పాటుకు సిబ్బంది అనధికారంగా కలెక్షన్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కనెక్షన్ పొందాలంటే కేవలం దరఖాస్తు పెడితేనే సరిపోదని, సంబంధిత అధికారి చేయి తడపాల్సివస్తోందంటున్నారు. గ్రూప్‌హౌస్‌లు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సముదాయాలు ఇలా ఒక్కో బిల్డింగ్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. అడిగినంత ఇవ్వకుంటే కొర్రీలు పెడుతూ తిప్పించుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 19, 2026
సీఎం చేతులో ఉగాది పురస్కారం అందుకున్న ముక్కాముల వాసి

ముక్కామలకు చెందిన ప్రముఖ గరగ నృత్యం కళాకారుడు పసుపులేటి అయ్యప్పస్వామి ఉగాది పురస్కారం అందుకున్నారు. అమరావతిలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో గురువారం సీఎం చంద్రబాబు నాయుడు అయ్యప్ప స్వామికి ఉగాది పురస్కారం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సృజనాత్మకత, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు కళాకారుడు అయ్యప్ప స్వామికి ప్రశంసా పత్రం అందించి సత్కరించారు.
News March 19, 2026
ప్రయాణికులకు అలర్ట్.. ఆలస్యంగా విశాఖ-రాజమండ్రి మెము రైలు

విశాఖపట్నం-రాజమండ్రి మధ్య ప్రయాణించే ప్యాసింజర్ రైలు వేళల్లో మార్పు చోటుచేసుకుంది. లింక్ రేక్ ఆలస్యం కారణంగా గురువారం సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం-రాజమండ్రి మెము (రైలు నం.67286) రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్ అయ్యిందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసింది.
News March 19, 2026
శ్రీకాకుళం రోడ్డు-ఉర్లాం రైల్వేస్టేషన్ల మధ్య డెడ్ బాడీ కలకలం

శ్రీకాకుళం రోడ్డు-ఉర్లాం రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాల పక్కన గురువారం ఓ డెడ్‌బాడీ కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు..శ్రీకాకుళం జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు పరిశీలించారు. మృతుడి వయస్సు 70 ఏళ్లు ఉంటాయని, గడుల షర్టు, పచ్చని లుంగీ ధరించి ఉన్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. వివరాలు తెలిసినవారు 94944 74582, 91103 05494 సంప్రదించాలన్నారు.


