News November 5, 2025
కామారెడ్డి: జిజ్ఞాసలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టు పోటీల్లో అర్థశాస్త్ర విభాగంలో ప్రథమ బహుమతి సాధించారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు అర్చన, కావేరి, వందన, ముస్కాన్, భవిత, సృజన రాణించారు. మహిళలకు ఉచిత బస్సు మహాలక్ష్మి పథకం- జిల్లాలో ప్రభావం అనే అంశంపై రాష్ట్రస్థాయిలో బుధవారం ఉత్తమ బహుమతి అందుకున్నారు.
Similar News
News November 5, 2025
గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం: కలెక్టర్

రేపు నిర్వహించే గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజలు, ఉద్యోగుల సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తామని కలెక్టర్ బుధవారం పేర్కొన్నారు. జిల్లా ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు ఇవ్వొచ్చని తెలిపారు.
News November 5, 2025
టీటీడీకి రూ.1000 కోట్ల విరాళాలు: బీఆర్ నాయుడు

AP: గత ఏడాది కాలంలో TTDకి రూ.1000Cr విరాళాలు వచ్చాయని బోర్డు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ఛైర్మన్‌గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శ్రీవాణి ట్రస్ట్ కింద 5వేల ఆలయాలు నిర్మించాలని తీర్మానించాం. తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని యోచిస్తున్నాం. తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తాం’ అని పేర్కొన్నారు.
News November 5, 2025
జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరగాలి: JC

జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ సేథు మాధవన్ అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమీక్షలో జేసీ మాట్లాడారు. ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా ఆర్డీవోలు, తహశీల్దార్లు జాగ్రత్త వహించాలని సూచించారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తదుపరి మండల, గ్రామ స్థాయిలో కూడా వెంటనే శిక్షణ జరపాలని ఆదేశించారు.


