News November 5, 2025
పోషకాహారాన్ని సకాలంలో అందించాలి: VZM JC

జిల్లాలోని 2,499 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సకాలంలో అందేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేథుమాధవన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. సరుకుల సరఫరాలో జాప్యం లేకుండా, నాణ్యమైన బియ్యం, పప్పు, నూనె అందించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ డైరెక్టర్ విమల రాణి, సివిల్ సప్లయిస్ డీఎం శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 28, 2026
VZM: నేర నియంత్రణకు కట్టుదిట్టమైన వాహన తనిఖీలు

జిల్లాలో నేరాలను అరికట్టేందుకు విజిబుల్ పోలీసింగ్‌తో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్నాయని ఎస్పీ దామోదర్ శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 10 ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, మద్యం, నాటుసారా, పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని ఆయన చెప్పారు. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మోటారు వాహన చట్టం ఉల్లంఘించిన వారిపై ఈ-చలానాలు విధిస్తున్నామన్నారు.
News March 28, 2026
VZM: టెన్త్ పరీక్షకు 99.72 శాతం హాజరు

జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పదో తరగతి జీవ శాస్త్రం పరీక్షకు 99.72 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా మొత్తం 22969 మంది హాజరు కావల్సి ఉండగా వారిలో 22,905 మంది హాజరయ్యారన్నారు. కేవలం 64 మంది విద్యార్ధులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు.
News March 28, 2026
జిల్లా యువత వీటికి దూరంగా ఉండండి: ఎస్పీ

ఐపీఎల్ సీజన్ నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా యువత ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్‌రావు సూచించారు. బెట్టింగ్ యాప్‌లు అప్పులపాలు చేసి ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కల్పిస్తాయని, వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తే 100కు ఫోన్ చేయాలని కోరారు. బెట్టింగులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


